Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ బొమ్మతో నాణేలు ఆవిష్కరణ…

సిఎం కెసిఆర్ బొమ్మతో నాణేలు ఆవిష్కరణ…

kcr-coins

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బొమ్మతో ముద్రించిన నాణేలను ప్రగతి భవన్ లో స్వయంగా కెసిఆర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మీద ఉన్న అభిమానంతో టిఆర్ఎస్ యుకె అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ నాణేలను ఒక వైపు కెసిఆర్ ఫోటోను మరో వైపు టిఆర్ఎస్ పార్టీ  కారు గుర్తు బొమ్మను ముద్రించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఈ సందర్భంగా కోర్ కమిటి మెంబర్ సురేష్ గోపతి మాట్లాడారు. ఈ నాణేలను సిఎం కెసిఆర్ చేతుల మీదగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కోర్ కమిటీ మెంబర్ భాస్కర్ మొట్ట స్పందిస్తూ… ప్రగతి భవన్ లో కెసిఆర్ తో విందు తరువాత జరిగిన సమావేశంలో కెసిఆర్ ఎన్ఆర్ఐల సమస్యలను అడిగి తెలుగుకోవడం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ… దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న కెసిఆర్ కు తమ పూర్తి మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు

cm-kcr-image