Home తాజా వార్తలు శ్రీలంక పేలుళ్ల ఘటనను ఖండించిన కెసిఆర్

శ్రీలంక పేలుళ్ల ఘటనను ఖండించిన కెసిఆర్

CM KCRహైదరాబాద్ : శ్రీలంకలో ఆదివారం మూడు చర్చిలు, మూడు హోటళ్లతో పాటు మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 185 మంది మృతి చెందారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ స్పందించారు. ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడిన వారికి నాగరిక సమాజంలో బతికే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుపోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతులకు నివాళులు అర్పించారు.  మృతుల కుటుంబాలకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుళ్ల ఘటనను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, తెలంగాణ మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు.

CM KCR Condemned Sri Lanka Bomb Blasts