Home తాజా వార్తలు కరీంనగర్ ప్రమాదంపై కెసిఆర్ దిగ్భ్రాంతి…

కరీంనగర్ ప్రమాదంపై కెసిఆర్ దిగ్భ్రాంతి…

kcr

హైదరాబాద్: కరీనంగర్ జిల్లా మానుకొండూరు మండలం చెంజర్ల వద్ద మంగళవారం ఉదయం ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో 8 మంది చనిపోగా, మరో 15 మంది వరకు త్రీవంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.