Search
Wednesday 26 September 2018
  • :
  • :

కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

08adadb05pఆదిలాబాద్ టౌన్ : కార్మికుల సమస్యలను పరిష్కరించమని కోరేందుకు వెళ్లిన అఖిల పక్షం నేతలను సచివాలయంలోనికి అనుమతించకుండా పోలీసుల చేత అరెస్టులు చేయించడం ముఖ్యమంత్రి నియంతపాలనకు నిదర్శణమని సిపిఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి ఆరోపించారు. సిఎం కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుటగల జాతీయ రహదారిపై కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నేతలు అరుణ్‌కుమార్, అనిల్‌కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీ, మున్సిపల్ పారిశుద్ద కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం సిఎం దొరతనానికి నిదర్శమన్నారు. నేతల అరెస్టులు అప్రజాస్వామికమని ప్రభుత్వచర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సిఎం తన వైఖరిని మార్చుకుని సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విసృత్తం చేస్తామని హెచ్చరించారు.

Comments

comments