Search
Wednesday 21 November 2018
  • :
  • :

కడియంకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సిఎం..

kadiam

హైదరాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదినం సందర్భంగా గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కడియం పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని సిఎం, గవర్నర్ ఆకాంక్షించారు. ఆదివారం డిప్యూటి సిఎం మహమూద్ అలీ, ఎంపి బండ ప్రకాశ్, ఎంఎల్ సి పూల రవీందర్, ఎంఎల్ఎ అరూరి రమేష్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్ రావు,  చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ డిప్యూటి మేయర్ సిరాజుద్దీన్, టిఆర్ఎస్ పార్టీ నేతలు పలువురు జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

comments