Home అంతర్జాతీయ వార్తలు బీజింగ్‌లో బ్రహ్మరథం

బీజింగ్‌లో బ్రహ్మరథం

cm-kcr
ముందుకొచ్చిన పలు కంపెనీలు సిఐసిఒతో సంప్రదింపులు
సఫలం ఆసక్తి ప్రదర్శించిన చైనా ఫర్చున్ ల్యాండ్ డెవలప్‌మెంట్
కంపెనీ, చైనా రైల్వే కార్పొరేషన్, సాని గ్రూప్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులను పెట్టేందుకు, పరి శ్రమలను స్థాపించేందుకు చైనాలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు సాను కూలత వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక త, నూతన పారిశ్రామిక విధానాల పట్ల ప్రధా నంగా ఇన్స్‌పర్ గ్రూప్, చొంక్వింగ్ ఇంటర్నే షనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(సిఐసిఒ), చైనా ఫర్చున్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ, చైనా రైల్వే కార్పొరేషన్, సాని గ్రూప్ తదితర సంస్థలు ఆసక్తి కనబర్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి భద్రతతో పాటు పరిశ్రమ లకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా వారికి వివరించారు. చైనా పర్యటనలో భాగంగా రాజ ధాని బీజింగ్‌లో శనివారం వివిధ కంపెనీల ప్రతినిధుల తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమా వేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో పాటు మంత్రు లు జూపల్లి కృష్ణారావు, జి.జగదీశ్‌రెడ్డి, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్, జిహెచ్‌ఎంసి కమిష నర్ సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధా నంగా ఇన్స్‌పర్ గ్రూప్, చొంక్వింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(సిఐసిఒ), చైనా ఫర్చున్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ, , చైనా రైల్వే కార్పొరేషన్, సాని గ్రూప్ తదితర గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయలను, కొత్త పారిశ్రామిక పాలసీ గురించి వివరించారు. సిఐసిఒ వైస్ ప్రెసిడెంట్ డు జియన్ జంగ్, డిజిఎం హె యుజున్, ఎగ్జిక్యూటీవ్స్ హ యైనులు, గౌ జుయాన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ దేశాలలో ఈ సంస్థ తమ శాఖలను కలిగి ఉంది. ఇప్పటికే న్యూఢిల్లీ, బీహార్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేపట్టిన ఈ సంస్థ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టు బడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఇన్స్‌పర్ సంస్థ ఇది వరకే గార్గవ్ కేంద్రంగా 2015 జనవరి నుంచే భారతదేశంలో తమ కార్యాకలాపాలను ప్రారంభిచింది. సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాలలో సేవలను అందిం చడం, క్లౌడ్ కంప్యూటింగ్ చైనాలోనే ఇన్స్‌పర్ సంస్థ మొదటి స్థానంలో ఉంది. సర్వర్ల అమ్మకాల్లో ఈ సంస్థ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో ఈ సంస్థ సేవలను అందిస్తుంది. మధ్యాహ్నం చైనా ఫార్చున్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ( సిఎఫ్‌ఎల్‌డిసి) ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఎఫ్‌ఎల్‌డిసి వైస్‌ప్రెసిడెంట్ లియంగ్ వెంటో, డైరెక్టర్ ప్లానింగ్ జాహంగ్ ఖీతన్, ప్రెసిడెంట్ అసిస్టెంట్ అన్ జింగ్, ఇండియన్ కన్సల్టెంట్ సోని బొడిగా తదితరులు పాల్గొనానరు. ఈ సందర్భంగా తెలంగాణ నూతన పారిశ్రామిక పాలసీపై ఆసక్తి కన బర్చారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, భద్రతకు తీసుకుంటున్న చర్యలను వారు అడిగి తెలుసుకున్నారు. సిఎఫ్‌ఎల్‌డిసి సంస్థ కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఇండస్ట్రీయల్ జోన్లు, ధీమ్ జోన్లు, పారిశ్రామిక వాడల ముఖ్య కేంద్రాల అభివృద్ధి , స్టాండర్డ్ వర్క్‌షాప్‌ల అభివృద్ధిలో ప్రసిద్ధి చెందింది. సిఎఫ్‌ఎల్‌డిసి సంస్థ అభివృద్ధి చేసిన వాటిలో గాన్ డెవలప్‌మెంట్ ఏరియా, డచ్చాంగ్ చావోబాయ్ నదీ పరివాహక ప్రాంతం, జయ్‌షాన్ హెచ్‌ఎస్‌ఆర్ న్యూసిటీ , షిన్ ఘూ ఎకో టెక్నాలజీ ఇన్నోవేషన్ సిటీ, చైనా ఫార్చున్ ఇన్నోవేషన్ పార్క్ తదితరులు ఉన్నాయి. ఇలాంటి పార్కులనే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ దృష్టి సారించనుంది. చైనా రైల్వే కార్పొరేషన్ (సిఆర్‌సి) ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతినిధి బృందం అనేక అంశాలపై చర్చించింది. అనంతరం ముఖ్య మంత్రి బృందం బీజింగ్ నగరాన్ని సందర్శించింది. ఈ సిటీని 1987 సంవ త్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. చైనా ఆర్కిటెక్చర్ ప్రతిభకు గొప్ప నిదర్శనంగా చెబుతుంటారు. ప్రాచీన నగరాన్ని చైనా ప్రభుత్వం సంరక్షిస్తున్న తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.