Home తాజా వార్తలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

CM-KCR

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉండే శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పర్యాటక శాఖ ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

CM KCR Maha Shivratri Greetings to the People