Search
Sunday 18 November 2018
  • :
  • :

రైతులందరికీ రైతు బంధు, జీవిత బీమా…

chief minister kcr environment day wishes to people

హైదరాబాద్: ప్రగతి భవన్ లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సిఎం కెసిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ…. ఒక రైతుకు ఎన్ని ప్రదేశాల్లో భూమి ఉన్నా… ఎన్ని ఖాతాలు ఉన్నా…ఒకే పాలసీని వర్తింపజేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి రైతు బంధు, జీవిత బీమా వర్తింపజేయాలని ఆయన చెప్పారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలని తెలియజేశారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు. పేరు మార్పిడి, పట్టాదారు పాసుపుస్తకాల్లో వచ్చిన తప్పులను తక్షణమే సవరించాలని ఆయన పేర్కొన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

Comments

comments