Home తాజా వార్తలు మూసవీడి కొత్త ఒరవడి

మూసవీడి కొత్త ఒరవడి

CM KCRసర్పంచ్‌లకు శిక్షణ, చట్టంపై అవగాహన : సిఎం కెసిఆర్
సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫిబ్రవరి-మే వరకు పూర్తిస్థాయి శిక్షణ, గ్రామ సమగ్ర వికాసానికి సర్పంచ్‌లేకీలకం, ప్రతి గ్రామానికి కొత్త చట్టం తెలుగు ప్రతులు, పూర్తిస్థాయి బడ్జెట్‌లోనే పంచాయతీలకు నిధులు

మన తెలంగాణ /హైదరాబాద్: ఇప్పుడు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, గ్రామాలను అద్బుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభత్ర పెంచడం లక్ష్యంగా కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టంపై అన్ని పంచాయితీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు అవగాహన కల్పించాలని, ప్రతీ గామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను అందజేయాలని చెప్పా రు. కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసికట్టుగా పనిచేయడానికి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు ఇంతకాలం కొనసాగిన మూస పద్ధతిలో కాకుండా, గ్రామాల సమగ్ర వికాసానికి పాటుపాడే ఉద్యమకారులుగా మా రాలని కెసిఆర్ ఆకాంక్షించారు. సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ ఇ చ్చే అంశంపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, శాసనసభ్యులు వేముల ప్ర శాంత్ రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి, కాలె యా దయ్య, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం కోసం పంచాయతీ కార్యదర్శులు నియామకం కూడా జరుగుుతున్నదని గుర్తుచేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామాభివృద్ధిలో వీరిద్దరి పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున గ్రామ పంచాయితీకు విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం జరగవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున రాష్ర్ట ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌నే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుుతాయి కనుక ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని, అందులోనే పంచాయితీలకు నిధులను కేటాయిస్తామని ఈ సమావేశంలో కెసిఆర్ స్పష్టత ఇచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులను కేటాయించడం సాధ్యం కాదని వివరించారు.

పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించేటప్పటికల్లా సర్పంచ్‌లకు, కార్యదర్శులకు పూర్థి స్థాయిలో శిక్షణ అందాలని, గ్రామాభివృద్ధి కోసం పాటు పడే కార్యకర్తలుగా వారిని తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ, ‘ఆస్కి’, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని సిఎం సూచించారు.

CM KCR Meeting on Gram Panchayat Elections