Home తాజా వార్తలు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

cm kcr meeting with cabinet ministers

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ బుధవారం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకాంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై కెసిఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి పలు రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలను ఆహ్వానిస్తున్నసంగతి తెలిసిందే. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి సిఎం కెసిఆర్ ఎలాంటి ప్రతి వ్యూహాలను రచిస్తారో చూడాలి.