Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

శామీర్‌పేట చెరువుకు మహర్దశ

kcr

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి, 365 రోజులూ జలకళ కలిగిస్తాం

ప్రగతి భవన్‌లో అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ 

మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శామీర్‌పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా శామీర్‌పేట పర్యాటక కేంద్ర ప్రణాళికను రూపొందించి, పూర్తి నివేదిక అందించాలని సూచించారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం నాడు శామీర్‌పేట చెరువు, పర్యాటకాభివృద్ధి అంశంపై అధికారులతో చర్చించారు. సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి భూపతిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులతో సిఎం మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా శామీర్‌పేట చెరువుకు నిత్యం నీళ్లు అందుతున్నాయని, ఈ చెరువు కాలువ ద్వారానే బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీరు అందుతుందని సిఎం స్పష్టం చేశారు. అటు శామీర్‌పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటక శాఖ అద్భుత అవకాశంగా స్వీకరించాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వస్తారని చెప్పారు. పర్యాటకులు బస చేయడానికి అనువుగా మంచి కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట ఆకర్షణీయమైన పూల చెట్లు పెంచాలని చెప్పారు. ప్రధాన రహదారి, చెరువుకట్ట మధ్య ఉన్న ప్రాం తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Comments

comments