Home జాతీయ వార్తలు మోడీతో కెసిఆర్ భేటీ

మోడీతో కెసిఆర్ భేటీ

CM KCR Meeting with PM Narendra Modi in Delhi

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన మోడీతో చర్చించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఏడు జోన్ల వ్యవస్థను తర్వగా ఆమోదించాలని కోరుతూ కెసిఆర్ మోడీకి వినతిపత్రం సమర్పించారు. మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల వంటి అంశాలపై రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛనివ్వాలని కెసిఆర్ ప్రధానిని కోరారు. కొత్త సచివాలయ నిర్మాణానికి కంటోన్మెంట్ స్థలం ఇవ్వాలని మోడీకి కెసిఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు  హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై కూడా కెసిఆర్ మోడీకి లేఖలు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం కెసిఆర్ ఢిల్లీకి వచ్చారు. నాలుగు రోజుల పాటు ఆయన ఢిల్లీలోను ఉంటారు. ఈ క్రమంలో పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. అంతేకాదు నీతి అయోగ్ నిర్వహించే సిఎంల సమావేశానికి కూడా కెసిఆర్ హాజరవుతారు.

CM KCR Meeting with PM Narendra Modi in Delhi