Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోఢీ తో ముగిసిన సిఎం కెసిఆర్ భేటీ..

 CM KCR meeting with Prime Minister Modi

న్యూఢిల్లీ: మూడు రోజుల ఢిల్లీ పర్యటన లో భాగంగా సిఎం కెసిఆర్ శనివారం మధ్యాహ్నం ప్రధాని మోఢీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన సహా పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, కాళేశ్వరానికి ఆర్థిక సాయం, రక్షణ భూముల కేటాయింపు సహా 11 అంశాలపై సిఎం కెసిఆర్ మోఢీకి వినతి పత్రాలు అందజేశారు.  హైకోర్టు విభజన ను త్వరగా పూర్తి చేయాలని, కొత్త జోన్ల  విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని ఆయన కొరారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ ప్రధాని మోఢీ ని కొరారు. అదే విధంగా కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన బైసన్‌ పోలో మైదానాన్ని ఇవ్వాలని, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ బిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కావాలని విజ్ఞప్తి చేశారు. సిఎం  కెసిఆర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

.

Comments

comments