Home తాజా వార్తలు గవర్నర్ తో సిఎం కెసిఆర్ భేటీ

గవర్నర్ తో సిఎం కెసిఆర్ భేటీ

CM KCR Meets Governor Narasimhan

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్ తో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు మంత్రులతో సమావేశం, మరోపక్క ఢిల్లీలో తెలంగాణ నేతలు.. ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా పలు కీలక అంశాలపై గవర్నర్ తో కెసిఆర్ చర్చలు జరిపినట్టు సమాచారం. గురువారం ఉదయం మంత్రి కెటిఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన ముఖ్య నేతలను కలిసి హడావుడిగా తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. కెటిఆర్ హైదరాబాద్ వచ్చిన కొద్ది సేపటికే సిఎం గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు గంట సేపు జరిగింది. టిఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు ఒక్క అడుగు ముందుకు వేసినట్టు కనిపిస్తోంది.