Home తాజా వార్తలు గడ్కరీతో సిఎం కెసిఆర్ భేటీ

గడ్కరీతో సిఎం కెసిఆర్ భేటీ

CM KCR Meets Union Minister Nitin Gadkar

ఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సిఎం కెసిఆర్ సోమవారం భేటీ అయ్యారు. నేషనల్ హైవేస్‌ను గ్రీన్ హైవేస్‌గా మార్చాలని ఆయన గడ్కరీని కోరారు. రీజనల్ రింగ్ రోడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అనుమతి ఇచ్చిన రోడ్లకు అలైన్‌మెంట్లు ఇవ్వాలని, నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆయన విన్నవించారు. ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. గత మూడు రోజులుగా కెసిఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆదివారం కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీతో కెసిఆర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

CM KCR Meets  Union Minister Nitin Gadkar