Home తాజా వార్తలు 29 నుంచి కెసిఆర్ ప్రచారం

29 నుంచి కెసిఆర్ ప్రచారం

CM KCR Parliament Election Campaign

 

ప్రజల మధ్య 6 రోజులు
1న మినహా రోజుకు రెండేసి సభలు

29 సాయంత్రం 4 గం.కు మిర్యాలగూడ, 5.30 గం.కు ఎల్‌బి స్టేడియం, 31 : 4గం.కు వనపర్తి, 5.30 గం.కు మహబూబ్‌నగర్ , ఏప్రిల్ 1 : 4గం.కు రామగుండం, 2న : 4గం.కు వరంగల్, 5.30 గం.కు భువనగిరి 3న : : 4గం.కు ఆంధోల్, 5.30 గం.కు నర్సాపూర్, 4న : 4గం.కు మహబూబాబాద్, 5.30 గం.కు ఖమ్మం

హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఆరు రోజులపాటు ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం పార్టీ విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలలో సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నెల 29 నుంచి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలలో సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు మినహా మిగతా రోజుల్లో రోజుకు రెండు బహిరంగ సభలు జరుగనున్నాయి.

సిఎం కెసిఆర్ పర్యటన వివరాలు

ఈ నెల 29వ తేదీ(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎల్.బి.స్టేడియంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల(పార్ట్) నియోజకవర్గాల సభ నిర్వహించనున్నారు. మార్చి 31వ తేదీ(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు వనపర్తిలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం సభ, అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్‌నగర్‌లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ జరుగనుంది. ఏప్రిల్ 1(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు రామగుండంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 2(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ, అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ జరుగనుంది. అలాగే ఏప్రిల్ 3(బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఆంధోల్‌లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ, అదే రోజు సాంయత్రం 5.30 గంటలకు నర్సాపూర్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సభను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4(గురువారం) సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్‌లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సభ, అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సభను నిర్వహించనున్నారు.

CM KCR Parliament Election Campaign Schedule release