Tuesday, April 23, 2024

15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్‌కు వెళ్తా : కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధికి నిధులు అందిస్తామని సిఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛన్లను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సిఎం పేర్కొన్నారు. పిఆర్‌సి పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుపుతామని సిఎం పేర్కొన్నారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేస్తా
అప్పులు చేసి మరీ దుబాయ్‌కి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తుంటే గల్ఫ్‌కు ఎందుకు వెళ్తున్నారని సిఎం ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్‌కు ముందు గల్ఫ్ పర్యటన వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని సిఎం పేర్కొ న్నారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేస్తానని, 15 మంది ఎమ్మెల్యేలను తన వెంట గల్ఫ్‌కు తీసుకెళతానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత నిర్మూలనకు కృషి చేస్తామని సిఎం స్పష్టం చేశారు.

CM KCR Press Meet at Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News