Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వర్షాలపై సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR Review Meeting With Officers Over Heavy Rains

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ గురువారం సమీక్ష చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై సిఎస్ జోషి, డిజిపి మహేందర్‌రెడ్డితో ఆయన మాట్లాడారు. అధికారులు ఆయా జిల్లాల్లో వర్షం, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం తమతమ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలని కెసిఆర్ చెప్పారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన పార్టీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

CM KCR Review Meeting With Officers Over Heavy Rains

Comments

comments