Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

స్వయం ఉపాధి పథకాలపై సిఎం సమీక్ష

KCR-IMAGE

హైదరాబాద్: రాష్ట్రంలోని బిసి, ఎంబిసిలకు ఉపాధి పథకాల నిమిత్తం ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉపాధి పథకాల కార్యాచరణపై కెసిఆర్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు బిసి, ఎంబిసిలను ఆర్థిక పరంగా బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు సిఎం పేర్కొన్నారు. బిసిల సంక్షేమం కోసం జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, లబ్ధిదారుల జాబితాలు తయారు చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. చిన్న వ్యాపారులతో పాటు కుల వృత్తుల వారికి తగిన ఆర్థికసాయం అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 100 శాతం రాయితీతో ఆర్థిక సాయం చేస్తామని  సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.

Comments

comments