Home నల్లగొండ తడాఖా చూపిస్తాం

తడాఖా చూపిస్తాం

CM KCR rule is the ideal model for the country

చరిత్ర పుటల్లో నేటి నల్లగొండ ‘ఆశీర్వాద’ సభ
మూడున్నర లక్షల మంది సభలో పాల్గొంటారని అంచనా
సిఎం కెసిఆర్ పాలనదేశానికే ఆదర్శంగా నిలిచింది
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలుఅభివృద్ధ్ది నిరోధకులు
అవకాశవాద కాంగ్రెస్, టిడిపి పొత్తు ఆదిలోనే విఫలం
మీడియా సమావేశంలో ఎంపీ గుత్తా, ఎమ్మెల్సీలు పల్లా, కర్నెలు

మన తెలంగాణ/నల్లగొండ :  నల్లగొండ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12నియోజకవర్గాలనుంచి మూడున్నర లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభను నిర్వహించనున్నట్లు,  బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌లు మాట్లాడారు. సిఎం కెసిఆర్ అమలుపరిచిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్ అభ్యర్థ్దులను అఖండమెజర్టీతో గెలిపిస్తాయని వివరించారు. నల్లగొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ బాధలను చూసి చలించిన కెసిఆర్ ఆ మేరకే మిషన్‌భగీరథ పథకంతో ఇంటింటికి మంచినీరు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నల్లగొండ జిల్లా గురించే ఆలోచించే కెసిఆర్ దేవరకొండలో ఆర్థ్ధిక భారంతో ఆడపిల్లలను అమ్ముకుంటున్నారన్న ఉద్ద్దేశ్యంతోనే కళ్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నాలుగేళ్ళలో కెసిఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు, అవార్డులు, రివార్డులు వస్తున్నా ఓర్వలేక ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షాలను చూసి మనస్థాపం చెంది ప్రజల వద్దకే వెళ్ళాలన్న సదుద్దేశ్యంతో ప్రజల ఆశీర్వాదం కోసం ముందస్తుకు వచ్చారని వివరించారు.

టిఆర్‌ఎస్ ప్రజల ఆశీర్వాదం కోసం ముందస్తుకొస్తే ఎదురునిలబడలేక వెనకడుగువేస్తూ పారిపోతున్నారని, కేసులతో అడ్డుకుందామని కుట్రపన్నుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 200 కేసులు వేసిన దౌర్భాగ్యపు నాయకులు దేశం ఎక్కడా కనబడరని, ఒక్క నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వం కిందనే కనబడుతున్నారని విమర్శించారు. గొప్పనాయకునిగా చలామణి అవుతున్న కోదండరామ్ కేవలం మూడండే మూడు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వద్ద మోకరిల్లుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలివచ్చి టిఆర్‌ఎస్ అభ్యర్థ్దులను ఆశీర్వాదించడం ద్వారా జిల్లాలోని 12సీట్లు గెలిపించితీరుతారమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి అవకాశవాదంతో కాంగ్రెస్‌తో పొత్తపెట్టుకంటుందని, ఇంతవరకు పొడుపులేని పొత్తు విజయతీరాలకు దేవుడెరుగు కాని విఫలయాత్రగా