Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వం ఉన్నంత కాలం రైతుబంధు పథకం:సిఎం కెసిఆర్

Cm Kcr Speech About Rythu Bandhu Scheme

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతుబంధు పథకం కొనసాగుతుందని ప్రగతి నివేదన సభా వేదికపై సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రైతులు అప్పుల పాలు కావొద్దని రైతుబంధు పథకం ప్రవేశపెట్టాం అని ఆయన అన్నారు. ఐదేళ్ల పాటు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే ఏ రైతుకు అప్పు ఉండదని సిఎం కెసిఆర్ అన్నారు. రెండు పంటలకు రూ. 8 వేలు పెట్టుబడి అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. పంట సాయం చేయమని ఏ రైతు దరఖాస్తు పెట్టుకోలేదన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పథకం అమలు చేశామని కెసిఆర్ తెలిపారు. ఇప్పటి వరకు 365 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సొమ్ము అందించామని చెప్పారు.

Comments

comments