Home కరీంనగర్ ‘ఈటెల రాజేందర్ అంటే కెసిఆర్ కుడిభుజం’

‘ఈటెల రాజేందర్ అంటే కెసిఆర్ కుడిభుజం’

CM KCR Speech

కరీంనగర్: హుజారాబాద్ నియోజకవర్గంలో మాకు భయంలేదని, అద్భుతమైన చైతన్యం చూపించిన నేల హుజూరాబాద్ అని ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై అనేక శాపాలు పెట్టారని చెప్పారు. తెలంగాణ నాలుగు సంవత్సరాల పసిగుడ్డు అని, అయినా అనేక రంగాల్లో దేశంలోనే నెం.01 స్థానంలో ఉన్నామన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదని, కరెంటు కోతలకు.. బిల్లు మోతలకు అల్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు.

కరెంటు పోదు.. ఇక పోనియ్యం… అన్నారు. 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, భవిష్యత్ లో నీటి కొరత రాదని కెసిఆర్ స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేసుకుంటున్నామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు రూ. 3, 016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. పండిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

కరీంనగర్ జిల్లా వాటర్ జంక్షన్ కాబోతుందని, తెలంగాణ మొత్తాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలన్నారు. 80 శాతం ఓట్లు ఈటెల రాజేందర్ కే వస్తాయని సర్వేలో తేలిందని, రాజేందర్ అంటే కెసిఆర్ కుడిభుజమని పేర్కొన్నారు. కెసిఆర్ కుడిభుజమైన ఈటెలకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బలహీనవర్గాల నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన నాయకుడు రాజేందర్ అని కెసిఆర్ అన్నారు.

CM KCR Speech at Karimnagar Public Meeting

Telangana Breaking News