Home తాజా వార్తలు ‘ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితిని కంప్యూటరైజ్ చేస్తాం’

‘ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితిని కంప్యూటరైజ్ చేస్తాం’

CM KCR Speech

నిర్మల్: నిర్మల్ కు రైలు, మెడికల్ కాలేజీ రెండు రావాలని ఆపధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో టిఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి పట్టుబట్టి ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేయాలని నన్ను కోరారన్నారు. ఎన్నికలన్నప్పుడు చాలా మంది చాలా రకాల ప్రలోభాలు చేస్తారన్నారు. మీరందరికీ ఒకటే మాట చెప్పుతున్న..ఇక్కడ చెప్పిన మాట విని ఇక్కడే వదిలిపెట్టిపోకండని, మీ గ్రామాల్లో ఏది వాస్తవం ఏది కాదు అని చర్చ పెట్టండని ప్రజలను కోరారు.

రాష్ట్రంలోని బిడి కార్మికులందరికీ పిఎఫ్ కటాఫ్ డేట్ తీసేసి అందరికీ పింఛన్ ఇస్తామని ఆయన హామీనిచ్చారు. రాష్ట్రంలో కంటివెలుగు పథకం ఎలా నడుస్తుందో మీకు తెలుసన్నారు. అది ఆషామాషీ కాదని, పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు. రెండు నెలల కష్టపడి కంటివెలుగు రూపొందించానని సిఎం చెప్పారు. కంటివెలుగు తర్వాత ఇఎన్‌టి బృందం వస్తదని, ఫ్రీగా చెకప్ చేసి బ్లడ్ శాంపిల్ తీసుకుంటరని.. ఇదంతా కూడా రికార్డు చేస్తారని తెలిపారు. ఎక్కడ ఏం జరిగినా, ఏ వ్యక్తికి ఏం జరిగినా.. ఆ వ్యక్తి రికార్డును ఓపెన్ చేస్తే.. ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి తెలిసిపోతుందన్నారు. తెలంగాణలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితిని కంప్యూటరైజ్ చేస్తున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. 

CM KCR speech at Nirmal Praja Ashirvada sabha