Home తాజా వార్తలు నేను తెలంగాణ పిచ్చొడినే…

నేను తెలంగాణ పిచ్చొడినే…

CM KCR Speech At TRS Pragati Nivedana Sabha in Kongarkalan

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు ఉన్నాయని ప్రగతి నివేదన సభా వేదికపై సిఎం కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఏం చేయలేరనే అహంకారంతో ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేశారని తెలిపారు. నాటి పాలకులు మనల్ని ఎగతాళి చేశారని, అవహేళన చేశారని ఆయన అన్నారు. మీ అందరి దీవెనలతో 2001లో జల దృశ్యంలో తన ప్రయాణం మొదలైందని ఆయన అన్నారు. రాజకీయ పంథాలో వెళ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. నువ్వు పిచ్చోనివా అని బర్దన్ అంటే.. అవును.. నేను తెలంగాణ పిచ్చొడినే అని అన్నానని సిఎం కెసిఆర్  గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం 36 పార్టీలను ఒప్పించాను అని తెలిపారు. ఆ విధంగా సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని కెసిఆర్ చెప్పారు.