Home జోగులాంబ గద్వాల్ సద్ది తిన్న దగ్గర రేవు తలవాలే : కెసిఆర్

సద్ది తిన్న దగ్గర రేవు తలవాలే : కెసిఆర్

cm-kcrగద్వాల్ : తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో మీకు తెలుసని సిఎం కెసిఆర్ గద్వాల్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో అన్నారు. గతంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేదో మీకు తెలుసు కదా?, మేము దగ్గరుండి పర్యవేక్షించబట్టే మీకు మంచి విద్యుత్ ను ఇవ్వగలుగుతున్నామని కెసిఆర్ చెప్పారు. ఆరోజుల్లో తెలంగాణ వస్తే ప్రజలు చీకట్లో ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎపి కన్నా మనమే మిగులు విద్యుత్ తో ముందున్నామని పేర్కొన్నారు. కళ్యాణలక్షీతో పేదింటి ఆడబిడ్డకు పెండ్లి చేస్తున్నాం. గర్భవతులకు అమ్మఒడి పథకంతో సేవా చేస్తున్నామని ఆయన తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంతో అందరికీ కంటి చూపుని మెరుగు చేస్తున్నమన్నారు. రైతు బంధు పథకం ఇక నుంచి రూ.8వేలు నుంచి రూ.10 వేలు ఇస్తామని కెసిఆర్ చెప్పారు. రైతు బీమాతో ఎటువంటి పైరవీలు లేకుండా… బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.

దేశ ప్రధానులే అబద్ధాపు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా సరిగా లేదు అంటూ… ప్రధాని మోడీ ప్రచారాలు చేస్తున్నారని సిఎం గరం అయ్యారు. 1974 ఆంధ్రప్రదేశ్ అడగక పోయినా… బచావత్ జూరాల ప్రాజెక్ట్ మంజూరు చేశారు. అలాంటి జూరాలను నింపకుండా అడ్డు పడుతార అంటూ నిప్పులు చెరిగారు. తాను గద్వాల పాదయాత్ర చేసి నిలదీస్తే కర్నాటక భూములకు పరిహారం చెల్లించి… ఆతర్వాతే జూరాల ప్రాజెక్టు నింపారని కెసిఆర్ చెప్పారు. వీలైనంత తర్వాలో గట్టు లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. గట్టు ప్రాజెెక్టుతో 38 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సిఎం చెప్పారు. సద్ది తిన్న దగ్గర రేవు తలవాలే అన్నారు. తెరాస లేకపోతే… కెసిఆర్ రాకపోతే గద్వాల జిల్లా అయ్యేదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. అందుకైనా మీరు గద్వాలలో తెరాసను లక్ష ఓట్ల మొజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. గట్టు లిప్ట్ ఇరిగేషన్ ఈ దఫాలో పూర్తి చేయకపోతే ఈ సారి ఓట్లు అడగమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.