Home తాజా వార్తలు ఆ ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది…

ఆ ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది…

CM KCR Speech in Independence Day in Golconda Fort

హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేదని సిఎం కెసిఆర్ తెలిపారు.  గోల్కొండ కోటలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి కెసిఆర్ మాట్లాడారు.   సమైక్య రాష్ట్రంలో ఎగబెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని, రైతుల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడు బిగించిందని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులను అరకట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకున్నామని వివరించారు.

కల్తీ విత్తన తయారీదారులపై పిడియాక్ట్ కేసులు పెట్టామని, కల్తీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి అణచివేస్తామని హెచ్చరించారు. బిసిల స్వయం ఉపాధికి ఆర్థిక సాయ పథకం, రైతు సామూహిక జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. బిసిలకు మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశామన్నారు. విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు పతకాలు అందజేశారు. మిషన్ భగీరథ దాదాపు పూర్తికావొచ్చిందని, మిషన్ భగీరథపై 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరించామని, హైదరాబాద్‌లో 40 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వైద్య విద్యను విస్తరించేందుకు కొత్తగా నాలుగు వైద్య కళాశాలను నెలకొల్పామన్నారు. హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో భారీ సంస్కరణలు చేశామని కొనియాడారు. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు త్వరలో కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటి రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని ప్రశంసించారు.