Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సమైక్య పాలనలో తెలంగాణ అంటే చిన్న చూపు : కెసిఆర్

CM KCR Speech in Pragathi Nivedana Sabha

రంగారెడ్డి : సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు అంటే నాటి పాలకులు చిన్న చూపు చూశారని తెలంగాణ సిఎం , టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. కొంగరకలాన్‌లో జరుగుతున్న టిఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని చూసి.. జనమా … ప్రభంజనమా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాటి పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచితే, నాటి సిఎంకు లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు. అయితే తన లేఖను ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ లేఖతోనే తెలంగాణోద్యమానికి బీజం పడిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాను ఎక్కని గడప, మొక్కని బండ లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణోద్యమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. దీక్ష చేసి, ప్రశాంతంగా ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ బాగు కోసం ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆత్మ ప్రొఫెసర్ జయశంకర్ సూచన నుంచే మిషన్ కాకతీయ పుట్టిందన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం జయశంకర్‌తో కలిసి నిద్రాహారాలు లేకుండా చర్చించుకున్నామని ఆయన చెప్పారు.

CM KCR Speech in Pragathi Nivedana Sabha

Comments

comments