Home రాష్ట్ర వార్తలు ముస్లింలకు 12% సాధించి తీరుతాం

ముస్లింలకు 12% సాధించి తీరుతాం

 CM-KCR

అవసరమైతే కేంద్రంపై పోరాటం,  ఇఫ్తార్ విందు సందర్భంగా సిఎం కెసిఆర్

హైదరాబాద్: అన్ని రంగాల్లో ముస్లింల భాగస్వామ్యాన్ని భవిష్యత్తులో మరింత పెంచుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. చట్టసభలతో పాటు మరిన్ని రంగాల్లో ముస్లింలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ముస్లింల సమగ్రాభివృద్దికి నిపుణులు మంచి సలహాలు ఇవ్వాలని, అవసరమైతే తనకు లేఖ (చిట్టీ) రూపంలో రాయండని సూచించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను సాధించి తీరుతామని, దీని కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపైన పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. బంగారం లాంటి తెలంగాణపై చెడు దృష్టి పడిందని, సమైఖ్యరాష్ట్రంలో అనేక రకాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఇస్లామిక్ సెంటర్‌ను ఏర్పాటకు స్థలాన్ని కూడా గుర్తించామన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎల్‌బి స్టేడి యంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందునిచ్చారు.

అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఈ సందర్బంగా కెసిఆర్ పేద ముస్లిం కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేశారు. సిఎం కెసిఆర్ మాట్లాడుతూ కాన్వెంట్ విద్య తరహాలో 204 మైనార్టీలకు గురుకులాలను ఏర్పాటు చేశా మని, ఒక్కో విద్యార్థిపైన సంవత్సరానికి రూ. 1,25,000లను ఖర్చు పెడుతున్నామని, రాబో యే ఐదేళ్లలో గురుకులాల నుంచి 1,33,000 విద్యావంతులు బయటకు రానున్నారన్నారు. సబ్సిడీలతో ముస్లింల అభివృద్ధి జరగదని, అందు కే రాష్ట్రంలో అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతు న్నామన్నారు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పద వి, విశ్వవిద్యాలయాల్లో వైస్‌చాన్స్‌లర్లుగా, డిప్యూ టీ మేయర్లుగా, నలుగురు ఎంఎల్‌సిలు ఇలా అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను మైనార్టీలకు కూడా అమలు చేస్తామన్నారు.

వందమంది మైనార్టీ యువతకు అఖిల భారత సర్వీసు ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 20 లక్షల ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. ఇప్ప టికే తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో ముందు కు సాగుతుందని, భవిష్యత్తులో దేశానికే తెలం గాణ ఆదర్శం అవుతుందని ఆయన పునరుద్ఘాటి ంచారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపా ధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీ క ర్ ఎస్.మధుసూధనాచారి,డిప్యూటీ సిఎం మ హ్మ ద్ మహమూద్ అలీ,మంత్రి నాయిని నర్సిం హరె డ్డి, ఎంపిలు అసదుద్దీన్ ఒవైసి,డి.శ్రీనివాస్, కె.కే శవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సిం గ్, డిజిపి అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.