Home తాజా వార్తలు నేడు ముంబయికి సిఎం కెసిఆర్

నేడు ముంబయికి సిఎం కెసిఆర్

CM KCR

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ముంబయి వెళుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ను ఆహ్వానించడానికి సిఎం కెసిఆర్ ముంబయి వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని పడ్నవీస్‌ను సిఎం స్వయంగా ఆహ్వానిస్తారు.

CM KCR to go Mumbai tomorrow