Search
Saturday 17 November 2018
  • :
  • :

మోడీతో భేటీ కానున్న కెసిఆర్…

Cm kcr to meet pm modi in delhi today

న్యూఢిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం సాయంత్రం 4.10 గంటలకు దేశప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సిఎం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కెసిఆర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోడీ నివాసంలో ఆయనను కలవనున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శక్రవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. మోడీతో భేటీ సందర్భంగా కొత్త జోనల్ విధానంపై సిఎం చర్చించే అవకాశముందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం కేటాయిస్తూ టిఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జోనల్ విధానంపై కేంద్రం ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కనీసం 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు, 20 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు ఇవ్వాలని కేంద్రం సూచించింది.

ఒకవేళ కుదరని పక్షంలో స్థానికులకు ఉద్యోగాల కల్పనను 85 శాతానికి పెంచుకోవచ్చని మోడీ సర్కార్ తెలిపింది. అయితే స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చామని సిఎం కెసిఆర్ మోడీకి సవివరంగా తెలిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ముందస్తు ఎన్నికలపై ప్రధాని మోడీ మనసులో ఏటువంటి ఆలోచన ఉందో తెలుసుకోవాలని కెసిఆర్ అనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు నుంచి వినిపిస్తోన్న సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రధానిని సిఎం కోరానున్నారు. సెప్టెంబర్ 2 ప్రగతి నివేదన సదస్సు ముగిసిన రెండు మూడు రోజుల్లోనే అసెంబ్లీని రద్దుచేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Comments

comments