Home జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ఆలయంలో కెసిఆర్ పూజలు

కాళేశ్వరం ఆలయంలో కెసిఆర్ పూజలు

CM KCRజయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ సిఎం కెసిఆర్ తన సతీమణితో కలిసి ఆదివారం  ఉదయం కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం అర్చకులు సిఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కెసిఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎంపి సంతోష్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌, దేవస్థానం ఈవో మారుతీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

CM KCR to Visits Kaleshwaram Temple