Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కరుణానిధికి నివాళి అర్పించిన కెసిఆర్

CM KCR Tribute to DMK chief Karunanidhi

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత ముత్తువేల్ కరుణానిధి(94) భౌతికకాయానికి తెలంగాణ సిఎం కెసిఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఎంతో పాటు టిఆర్ఎస్ ఎంపి కవిత కూడా ఉన్నారు. నివాళి అర్పించిన తర్వాత జోహార్ కరుణానిధి అంటూ కెసిఆర్ పిడికిలి బిగించారు. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కెసిఆర్ పరామర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ మాజీ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ లు కూడా కరుణానిధికి భౌతికకాయానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటల నుంచి కరుణ అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటలకు ఆయన అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. కరుణనిధిని కడసారి చూసేందుకు భారీగా ఆయన అభిమానులు రాజాజీ హాల్ వద్దకు చేరుకుంటున్నారు.

Comments

comments