Search
Wednesday 26 September 2018
  • :
  • :

తెలంగాణ భావజాల దీప్తి ప్రొ.జయశంకర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ఘన నివాళి

Pro-Jaya-Shankarహైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయులని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా యావత్తు తెలంగాణ సమా జం ఆయనకు ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జయశంకర్ పోషించిన పాత్రను, యావత్తు తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఆయన సేవలను ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం  అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని, ఇదే ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో  పార్టీ నేతలు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను, ప్రజలకు సైద్ధాంతిక అవగాహన కలిగించడంలో, వాస్తవాలను విడమరిచి చెప్పడం మరువలేనదని పేర్కొన్నారు.

Comments

comments