Home తాజా వార్తలు 29న బెజవాడకు సిఎం కెసిఆర్

29న బెజవాడకు సిఎం కెసిఆర్

CM KCRహైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 29వ తేదీన కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లనున్నారు. బుధవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఆరోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. వైఎస్ జగన్ శనివారం సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

CM KCR Visit to Vijayawada on 29th