Search
Friday 21 September 2018
  • :
  • :

మోడీకి కెసిఆర్ లేఖ

KCR-with-Modi

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. జులై 1 నుంచి జిఎస్టి అములు కానున్న నేపథ్యంలో జిఎస్టి నుంచి మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టు పనులను మినహాయించాలని ఆయన లేఖలో కోరారు. అంతేకాక బీడీ, గ్రానైట్‌ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. బీడి పరిశ్రమపై భారీ పన్నులు విధిస్తే.. ఉపాధికి నష్టంవాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గ్రానైట్ ఉత్పత్తులపై 12, 14 శాతం విధిస్తే పరిశ్రమ దెబ్బతింటుందని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.

Comments

comments