Home జాతీయ వార్తలు సిఎం కాదు..ఆయనో కీలు బొమ్మ..!!

సిఎం కాదు..ఆయనో కీలు బొమ్మ..!!

Nabam-Tukiఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలిఖో పల్‌ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శించింది. గవర్నర్ జెపి రాజ్ ఖోవా చేతిలో కలిఖో కీలు బొమ్మల వ్యవహరిస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ పక్షనేత నబాం టూకీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అరుణాచల్ పీపుల్స్ పార్టీకి గవర్నర్ బంగ్లా రాజ్‌భవన్ కేంద్ర కార్యాలయంగా మారిందని ఆరోపించారు. కేంద్రం ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గవర్నర్ రాజ్ ఖోవా చక్కగా నిర్వర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బమాంగ్ ఫెలిక్స్ ఎద్దేవా చేశారు. గవర్నర్ చెప్పిన విషయాలకు మాత్రమే సిఎం స్పందిస్తున్నారిన, ఆయన సాధించింది ఏం లేదన్నారు.