Home తాజా వార్తలు ఫార్మారంగం ప్రతినిధులతో సిఎం భేటి

ఫార్మారంగం ప్రతినిధులతో సిఎం భేటి

KCR23హైదరాబాద్ : రాష్ట్రంలో ఫార్మారంగం అభివృద్ధి దృష్టా సిఎం కెసిఆర్ ఫార్మారంగం ప్రతినిధులతో సోమవారం భేటి అయ్యారు. ఫెర్రింగ్ ఫార్మా ఛైర్మన్ ఫ్రెడిరిక్ పాల్సన్, సిఎండి అశోక్ అలైట్ సిఎంతో భేటి అయిన వారిలో ఉన్నారు. ఫార్మాసిటి నిర్మాణం పై వారు చర్చలు జరిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటి నిర్మాణం చేపడతామని, ఫార్మా యూనివర్సిటి నెలకొల్పుతామని సిఎం తెలిపారు. ఫార్మా సిటిలో భాగంగా ప్రత్యేక టౌన్ షిప్, ఉమ్మడి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ యూనిట్ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ఫార్మారంగం ప్రతినిధులు సిఎంకు తెలిపారు.