Home జాతీయ వార్తలు మేఘాలయ కాంగ్రెస్‌దే

మేఘాలయ కాంగ్రెస్‌దే

congress

షిల్లాంగ్ :  ఈశాన్య రాష్ర్టాల్లో కాంగ్రెస్ జాడ కనుమరుగవుతుందన్న సమయంలో  కాంగ్రెస్ పార్టీకి ఇదో ఊరట. మేఘాలయాలో ఆ పార్టీ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లుతున్నది. మేఘాలయా రాష్ర్టాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీ ఆధిక్యంలో దూసుకువెళ్తున్నది. మేఘలయాలో 59 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులకు 31 సీట్లు అవసరం. అయితే తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్ల ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో ప్రత్యర్థి నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పిపి) 15 సీట్ల ఆధిక్యంతో ఉంది. మేఘాలయాలో బిజెపి కేవలం ఆరు సీట్లలో మాత్రమే  ఆధిక్యంలో కొనసాగుతుంది. సిఎం అభ్య‌ర్థి ముఖుల్ సంగ్మా అంప‌టి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం కేతనం ఎగరవేశారు.