Home తాజా వార్తలు పేద రోగులకు సిఎంఆర్‌ఎఫ్ బంద్?

పేద రోగులకు సిఎంఆర్‌ఎఫ్ బంద్?

Telangana-Government_manate copyమన తెలంగాణ / హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే రోగు లకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఒసి) జారీ చేయడం లేదు. చికిత్సలకు అయ్యే వ్యయం రెండు లక్షల రూపాయలకు పైబడి ఉంటేనే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అకస్మాత్తుగా ఈ విధా నాన్ని నిలిపివేయడంతో పలువురు పేద రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రజా ప్రతి నిధుల సిఫారసులు పనిచేయకపోవడంతో రోగు లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిషేధం ఎప్ప టి వరకు కొనసాగుతుందో చెప్పలేమని సిఎంఆర్ ఎఫ్ విభాగం అధికారులు స్పష్టం చేయడంతో పలువురు భీతిల్లిపోతున్నారు. సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందచేయడంలో రాష్ట్ర ప్రభు త్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం మాదిరి కఠినంగా వ్యవహరించకుండా బాధితుల కు వీలైనంత సహాయం అందేలా ప్రయత్నిస్తు న్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ పథకం పేద, మధ్య తరగతి వర్గాల రోగులకు పెద్ద దిక్కు గా మారింది. ఆరోగ్య శ్రీ పరిధిలోని లేని రోగాల కు చికిత్స చేయించుకునేందుకు సిఎంఆర్‌ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుని పలువురు సహాయం పొందుతున్నారు. రోగుల ఆర్థిక స్థితిగతులు, ప్రజాప్రతినిధుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి సహాయం మంజూరు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని రోగాలకు, దీర్ఘ కాలిక రోగాలకు చికిత్స చేయించుకునే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరప్రదాయినిగా మారింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సిఎస్‌ఆర్) కింద పలువురు పారిశ్రామికవేత్తలు, సంఘ సేవకులు, వ్యాపారులు సిఎంఆర్‌ఎఫ్‌కు కోట్లాది రూపాయలు విరాళంగా ప్రకటిస్తాయి. ఎక్సైజ్ శాఖ నుంచి కొంత శాతం నిధులు సమకూరుతు న్నాయి. ఇలా సమకూరిన నిధులను సిఎం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రోగులకు మం జూరు చేస్తారు. సిఎంఆర్‌ఎఫ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఆరో పణలు వస్తే చర్యలు తప్పవని సిఎం హెచ్చరించడంతో అధికారులు నిబద్ధ తతో పనిచేస్తున్నారు. గతంలో మాదిరి మండల రెవెన్యూ కార్యాలయాలకు కాకుండా నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే చెక్కు పంపిస్తున్నారు. సుమా రు పదివేల మంది రోగులకు రూ. 80 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. రోగులు లేదా వారి సంబంధీకులు దరఖాస్తు అందించిన వెంటనే ఆమో దం తెలిపి చెక్కులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స సౌక ర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోక తప్పడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించాలి లేదా ప్రభు త్వం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ తెచ్చుకుంటే తప్ప చికిత్స చేయరు. చికిత్స కు ఇరవై లేదా యాభై వేల రూపాయలు అయితే సమకూర్చుకుంటారు. అంతకన్నా మించిన వ్యయం అయితే డబ్బులు సమకూర్చుకోవడం కష్టం. తక్షణమే చికిత్స చేయించుకోవాల్సిన వారు, ఆర్థిక స్థోమత లేని రోగులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఎస్టిమేషన్ లెటర్లు తీసుకుంటున్నారు. ఈ లెటర్‌కు నియో జకవర్గం ఎమ్మెల్యే సిఫారసు లేఖను జతపర్చి ముఖ్య మంత్రి కార్యాలయంలో అందచేస్తున్నారు. రోగుల పరిస్థితులు, సిఫారసు లను పరిగణనలోకి తీసుకుని చికిత్సకు రూ. 2 లక్షల సహాయం కోరితే లక్షన్నర వరకు మంజూరు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తాన్ని మ ంజూరు చేస్తూ లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఒసి) జారీ చేస్తున్నారు. ఈ ఎల్‌ఒసి ని తీసుకువెళ్ళి పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయిం చుకుంటున్నారు. ఈ విధా నాన్ని నిలిపివేయడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ రోగానికి చికిత్స చేసే సౌకర్యం లేదు, ప్రైవేటు ఆసు పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ఎల్‌ఒసి ఇవ్వరా అని పలువురు అడుగు తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు ఎల్‌ఒసి నిలిపివేశామని, తమను నిందించవద్దని సిఎంఆర్‌ఎఫ్ అధికారులు సర్దిచెబుతున్నట్లు తెలిసింది.