Home కుమ్రం భీం ఆసిఫాబాద్ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

giving

మన తెలంగాణ/ఆసిఫాబాద్ :  ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును సోమవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి బాధితురాలి భర్తకు అందజేశారు. రెబ్బెన మండలం వరదలగూడ గ్రామానికి చెందిన భారతి గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా  ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరై రూ. 52వేల చెక్కును బాధితురాలి భర్త గుణవంత్‌కు అందజేశారు. వీరి వెంట గ్రంథాలయ చైర్మన్ కనకయాదవరావు పాల్గొన్నారు.