Home జాతీయ వార్తలు ప్రియాంకతో మాకు నష్టం లేదు

ప్రియాంకతో మాకు నష్టం లేదు

cm-yogi-adityanath

లక్నో: కాంగ్రెస్ తురుపు ముక్కగా భావిస్తున్న ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం వల్ల బిజెపికి ఎలాంటి నష్టమూ లేదని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆయన అంటూ, అందువల్ల ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమీ ఉండదని ఆయన అన్నారు. ప్రియాంకను తూర్పు యుపి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ పార్టీ నియమించడాన్ని ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆదిత్యనాథ్ అభివర్ణించారు. అంతేకాదు రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పిల పొత్తువల్ల అందరూ అనుకుంటున్నట్లుగా తమకెలాంటి ప్రమాదమూ లేదని ఆయన అంటూ, ఆ పొత్తులో అప్పుడే లుకలుకలు మొదలైనాయని కూడా అన్నారు.‘ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ప్రియాంకను ఈ సారి పార్టీ ప్రధాన కార్యదర్శి(తూర్పు యుపి ఇన్‌చార్జి)గా నియమించింది. ఆమె సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఇంతకు ముందు కూడా ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ సారి ఆమె పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. దానివల్ల బిజెపికి ఎలాంటి నష్టమూ లేదు’ అని పిటిఐకి చ్చిన ఓ ఇంటర్వూలో ఆదిత్యనాథ్ అన్నారు.

ఎస్‌పిబిఎస్‌పి పొత్తు ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలపై ఏ మేరకు దెబ్బతీస్తుందని ప్రశ్నించగా ఈ పార్టీల పొత్తులో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. కొన్ని సీట్ల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినటు ్లవస్తున్న వార్తలను ఆయన ప్రస్తావిస్తూ, పొత్తుపై అనవసర భయాలను సృష్టిస్తున్నారని చెప్పారు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలకు ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దేశం ఎవరి చేతిలో భద్రంగా, సుబిక్షంగా ఉంటుందని భావిస్తారో ఆ వ్యక్తికే జనం ఓటేస్తారని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వైమానిక దళాలు పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ. దేశ ప్రయోజనాలకోసం మోడీ అవసరమైనప్పుడు కఠిన నిరయాలు తీసుకున్నారని అన్నారు. ‘సమర్థవంతమైన నాయత్వ లక్షణమిది’ అని ఆదిత్యనాథ్ అన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ సూపర్‌పవర్‌గా ఎదిగిందని బల్లగుద్ది చెప్పగలనని కూడా ఆయన అన్నారు. ప్రధాని పనితీరు ఆధారంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.2014 ఎన్నికల్లో మోడీ పేరు పని చేస్తే ఈ సారి ఆయన పేరు, పని రెండూ పార్టీకి విజయం తెచ్చిపెడతాయని ఆదిత్యనాథ్ అన్నారు.

CM Yogi Adityanath Speech on  Priyanka Gandhi