Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సిఎం సాక్షిగా…కేంద్ర మంత్రి హామీకి నేటికి మూడేళ్లు!

gandhi

మన తెలంగాణ/రాయికల్ : 2015 మార్చి 2న రాయికల్ పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోలేరాం మినీ ఐటిడిఎ మంజూరుతో పాటు బోర్నపెల్లి- జగన్నాథ్‌పూర్ వాగుపై వంతెన నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి నేటికి మూడేళ్లు కావస్తుంది. అప్పుడు ఇచ్చిన హామీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మహరాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావులే ప్రత్యేక్ష సాక్షులు. ఆ హామి అమలుకు నోచుకోక మూడేళ్లు కావస్తున్న పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనర్హం. గిరిజనుల అభివృద్ధ్ది ఇక్కడ ఎండమావిగానే మారింది. విద్య, వైద్యం, అంతర్గత రహదారులు, అందరికి ఇండ్లు గిరిపుత్రులకు అందని ద్రాక్షగానే మిగిలాయి. అనేక ఏళ్లుగా మినీ ఐటిడిఎ సాధనకు పోరాడుతున్న గిరిజనుల ఆందోళలనకు హామీలే తప్ప ఆచరణసాధ్యం కావడం లేదు. పాలకుల నిర్లక్షం… అధికారుల అలసత్వం వల్ల గిరిజనుల అభివృద్ధ్ది మూడడుగులు ముందుకు…ఏడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. జగిత్యాల జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న రాయికల్ మండలంలో అటవీ పుత్రుల అభివృద్ధ్ది అంతంతా మాత్రంగానే ఉంది. జగన్నాథ్‌పూర్, దావన్‌పెల్లి, తాట్లవాయి, ధర్మాజీపేట, ఒడ్డెలింగాపూర్, చింతలూర్, వస్తాపూర్, రాజనగరం, దర్మాజీపేట, ఇటిక్యాల తదితర గ్రామాల్లో గిరిజనులు జీవిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఈ గిరిజనులు ఓటుబ్యాంకుగానే పనికి వస్తున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు మండల పరిధిలో మినీ ఐటిడిఎ ఏర్పాటుకు నాయకులు హామిలు ఇవ్వడమే తప్ప ఆచరణలో అమలైయ్యేలా చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. లం బాడి, నాయకపు, తోటి, ఆదివాసీ, గొండు తదితర తెగలు ఈ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో జీవిస్తున్నారు. మండలంలో 27 గ్రామాలుండగా మేజార్టీ గ్రామాల్లో గిరిజన జనాభా ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నప్పటికి ఆశించిన ప్రగతి కానరావడం లేదు. అభివృద్ది నిధులు గిరిజన గ్రామాల దరి చేరకపోవడంతో అంతర్గత రహదారులు, అధునిక వైద్యం, విద్య, ఉపాధి ఆవకాశాలు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. జగన్నాథ్‌పూర్ గిరిజనులు వంతెన నిర్మించాలని కోరుతున్నా ఆ హామీ కాగితాలకే పరిమితమైంది. ఇక్కడి బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకం అలంకార ప్రాయమైంది. కరంటుబిల్లులు కట్టలేక పథకం నిర్వీర్యమైంది. బోర్నపెల్లి గిరిజనుల కోసం నిర్మించిన ఎత్తిపోతల పథకం పని చేయక ఏళ్లు గడుస్తుంది. ఆయా గ్రామాల్లో చాలా మంది గిరిజనులు సొంతిల్లు లేక పూరిపాకల్లోనే జీవిస్తున్నారు. సిఎం కెసిఆర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోలే రాం, మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులు మూడేళ్ల క్రితం రాయికల్‌లో  పర్యటించినప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చిన హామి ఇప్పటికి అమలు కావడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. పాలకులు మారిన గిరిజనుల తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యే క దృష్టిసారించి మినీ ఐటిడిఎ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Comments

comments