Home తాజా వార్తలు ఆకుపచ్చ తెలంగాణ సాధనకు సహకరించండి : కెసిఆర్

ఆకుపచ్చ తెలంగాణ సాధనకు సహకరించండి : కెసిఆర్

CM-KCR

హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్ర సాధనకు అందరూ సహకరించాలని సిఎం కెసిఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంపై గురువారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను చేపట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అడవుల సంరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడవులను నాశనం చేయవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో నర్సరీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోట్లాది మొక్కలను నాటామని చెప్పారు. విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారుల వెంట పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ప్రజలు ఇంటికో మొక్కను నాటాలన్నారు. అప్పుడే కరవు నివారణ సాధ్యమని ఆయన తెలిపారు.