Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వర్షాలతో ఒసిపిలు అతలాకుతలం

Coal did not come out for two days

రెండు రోజులుగా బయటకు రాని బొగ్గు పెళ్ల
నిత్యం రూ.10కోట్ల నష్టం
షెడ్లకే పరిమితమైన 22,700 మంది కార్మికులు
ఎన్‌టిపిసిపి సజావుగా బొగ్గు రవాణా

మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: ఎడతెరిపి లేని వాన సింగరేణిని నట్టేట ముంచుతుంది.గత రెండు రోజులుగా ఒపెన్ కాస్టుల నుంచి బొగ్గు పెళ్ల బయటకు రాకపోవడం శోచనీయం. ఒక్క రామగుండం రీజియన్‌లోనే నిత్యం పది కోట్లకు పైగా సంస్థకు నష్టం వాటిల్లుతుంది. 22,700 మం ది కార్మికులు విధులకు హాజరై షెడ్లకు పరిమితమవుతున్నా రు. ఓసిపిలన్ని బురదమయమయ్యాయి.
వాహనాలు లోనికి వెళ్లలేని పరిస్థితి ఉంది. వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.యంత్రాలు వరదల్లో మునిగిపోకుం డా చర్యలు తీసుకుంటున్నారు.లోతట్టు ప్రాంతాల్లో ఉన్న భారీ యంత్రాలను సైతం పైకి తీసుకొచ్చి పెడుతున్నారు. భారీ వాహనాలైన డంపర్లు పార్కింగ్ యార్డుల్లోనే నిలిచిపోయాయి. ఒక్క ఎన్‌టిపిసికి వెళ్లే బొగ్గు మాత్రం యధావిధి గా రవాణా జరుగుతుంది.వివరాల్లోకి వెళితే .. ఆర్‌జి1 డివిజన్‌లోని మేడిపల్లి ఒసిపిలో రోజు 12 వేల టన్నుల బొగ్గు, 40వేల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ (మట్టి) వెలికితీయాల్సి ఉంది.ఆర్‌జి2లోని ఒసిపి3 ప్రాజెక్టులో రోజు 15వేల టన్నుల బొగ్గు, 80వేల క్యూబిక్ మీటర్ల ఓబి రావాల్సి ఉం ది. ఆర్‌జి3 డివిజన్ పరిధిలోని ఒసిపి1 ప్రాజెక్టులో నిత్యం 40వేల క్యూబిక్ మీటర్ల ఓబి, 15వేల టన్నుల బొ గ్గు ఉత్పత్తి జరుగాల్సి ఉంది. ఒసిపి2 ప్రాజెక్టులో 25 వేల క్యూబిక్ మీటర్ల ఒబి, 12 వేల బొగ్గు ఉత్పత్తి రావాల్సి ఉం ది. కానీ రోడ్లన్ని బురదమయంగా మారడంతో వాహనాలు లోనికి వెళ్లే లేని పరిస్థితి ఉంది. నాలుగు ఒసిపిల్లో రోజుకు 48 వేల టన్నుల బొగ్గు, లక్షా 85 వేల క్యూబిక్ మీటర్ల ఓబి నష్టం వాటిల్లుతుంది.
బొగ్గు టన్నుకు 1500 రూపాయల చొప్పున నిత్యం 7 కోట్ల 20లక్షలు, ఒబి క్యూబిక్ మీటర్‌కు 100 రూపాయల చొప్పున కోటి 85 లక్షల నష్టం జరుగుతుంది. వీటికి తోడు అధికారులు, కార్మికుల జీతభత్యాలు సంస్థకు తీరని నష్టం కలిగిస్తుంది. నాలుగు ఓసిపిలలో 22,500 మంది కార్మికులతో పాటు ఓవర్‌బర్డెన్ తీస్తున్న ప్రైవేట్ కంపెనీలకు చెం దిన 4200మంది కార్మికులు విధులకు హాజరై విశ్రాంతి మంధిరాలకే పరిమితమవుతున్నారు.
కానీ ఎన్‌టిపిసికి బొగ్గు రవాణా యధావిధిగా జరుగుతు ంది. స్టాక్ యార్డులలో బొగ్గు నిల్వలు పెద్ద ఎత్తున ఉండడంతో ఒసిపి1 సైలో నుంచి 24వేల టన్నులు, ఒసిపి3 సిహెచ్‌పి నుంచి 21వేల టన్నుల బొగ్గు రవాణా అవుతుం ది.ఇదొక్కటే సింగరేణికి ఊరటగా చెప్పవచ్చు.అలాగే ఒసి పి3 ప్రాజెక్టులోని బీమా డ్రాగ్‌లైన్, ఒసిపి1 ప్రాజెక్టులో ని ఫృథ్వీభంజన్ డ్రాగ్‌లైన్‌ల సహయంతో ఓబిని తొలగిస్తున్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు, ఓబి ఉత్పత్తి అంతంత మాత్రంగానే జరుగుతుంది. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ లు చెపుతుండడంతో యాజమాన్యం అప్రమత్తమయింది. యంత్రాలు మునిగిపోకుండా చర్యలు తీసుకున్నారు.

Comments

comments