Search
Sunday 23 September 2018
  • :
  • :

నాగు పాముల సయ్యాట…?

snakesఆదిలాబాద్‌ః దండేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఒక అరుదైన దృశ్యం కనిపించింది. రెండు నాగుపాములు మైమరిచి గంటల పాటు సయ్యాటలాడాయి. ఈ విషయం తెలిసి చూసేందుకు క్యూ కట్టారు. మండల కేంద్రానికి చెందిన మల్లయ్య పెరట్లో ఆదివారం రెండు పాములు సయ్యాటలాడాయి. రెండు గంటల పాటు పాములు సయ్యాటలాడుతూ స్థానిక ప్రజలను కనువిందు చేశాయి. పాములు బెదరకుండా సహజసిద్దంగా సయ్యాటలాడుతున్న పాములను ప్రజలు కనులారా తిలకించారు. రెండు గంటల పాటు అన్నీ మైమరిచి సయ్యాటలాడిన పాములు ప్రజల అరపులతో పెరటి ఆవరణ నుండి నిష్క్రమించాయి.

Comments

comments