Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో కొకైన్ పట్టివేత

Cocaine Seized from Foreigner in Hyderabad

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను సోమవారం ఉదయం ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా నిందితుడిని పట్టుకుని 17 గ్రాముల కొకైన్ పట్టుకున్నామని, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. నిందితుడు బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్‌ను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Cocaine Seized from Foreigner in Hyderabad

Comments

comments