Home తాజా వార్తలు కాఫీ గింజలే కదా అనుకోకండి

కాఫీ గింజలే కదా అనుకోకండి

coffe-seedsకాఫీ గింజలు అయినా, వాటిని పొడి చేసి ఫిల్టర్ కాఫీ చేసుకున్నా ఆ గుబాళింపు, ఘుమఘుమలే వేరు. పొద్దున్నే లేచి ఒక కప్పు ఫిల్టర్ కాఫీ తాగామా?…మనసు పరుగులెడుతుంది చూడండి…ఆ వేగం పట్టుకోవశమా?… సరే…కాఫీ టేస్టు సంగతి ఇక్కడ ఎందుకు కానీ…కాఫీ గింజలను ఉడికించిన తర్వాత లేదా కాఫీ ఫిల్టర్ వేసిన తర్వాత మిగిలిన పిప్పిని మనం సాధారణంగా పారేస్తుంటాం…అలా చేయకండి…ఆ పిప్పితో అనేక లాభాలున్నాయి మరి…పిప్పిని పేస్టులా చేసి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా పట్టించి కొద్ది సేపటి తర్వాత కడిగేసుకుంటే క్రమంగా ముఖ వర్చస్సు పెరుగుతుంది.
పిప్పిని బాగా జిడ్డు పట్టిన, మరకలు పట్టిన వంట పాత్రలను త్వరగా శుభ్రం చేసుకునేందుకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.
కావాలనుకుంటే ఆ పిప్పినే వేడి నీటిలో మరిగించి మరోసారి కాఫీ లాగించవచ్చు. అయితే కాస్త రుచిలో తేడా ఉంటుం దంతే…పిప్పితో జిడ్డు చేతులను శుభ్రం చేసుకోవచ్చు.
మొక్కలు చక్కగా పెరగటానికి వీలుగా పిప్పిని వాటి మొదళ్ళలో వేసి ఎరువులా వాడుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ దుర్వాసన రాకుండా ఒక పాత్రలో ఆ పిప్పిని వేసి ఉంచితే సరి… ఇలా కాఫీ గింజలు లేదా పొడి పిప్పితో అనేక లాభాలున్నాయి. ట్రై చేసి చూడండి మరి…