Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆంధ్రాబ్యాంక్ ఎటిఎంల నుంచి ఇక చిల్లర నాణేలు

Andhra-Bankహైదరాబాద్ : ఇప్పటి వరకూ ఏటిఎంల నుండి కేవలం కరెన్సీ నోట్లనే డ్రా చేసుకోవడం మనం చూశాం, కానీ ఇక పై చిల్లర నాణేలను కూడా వినియోగదారులు డ్రా చేసుకోవచ్చు. ఆంధ్రాబ్యాంక్ ఈ సరికొత్త అవకాశాన్ని తన వినియోగదారులకు అందిస్తోంది. ఆంధ్రా బ్యాంక్ నారాయణగూడ ఈ బ్యాంకింగ్ సెంటర్ కేంద్రంలో ఉన్న ఎటిఎంలో ఈ సదుపాయాన్ని వినియోగదారులకు ప్రారంభించింది. బుధవారం  రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం (ఇష్యూ డిపార్ట్‌మెంట్ ) వి.ఎస్. షేకావత్ ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు, కాగా  హైదరాబాద్ పాతబస్తీలోని ఆంధ్రాబ్యాంక్ ఈ కేంద్రంలోనూ ఇదే సదుపాయాన్ని ఆ బ్యాంక్ ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డిప్యూటి జనరల్ మేనేజర్ ఎంఎన్. సుధాకర్, జోనల్ మేనేజర్ దినకర్ చక్రబర్తి తదితరులు హాజరైనారు.

Comments

comments