Search
Sunday 22 July 2018
  • :
  • :

అభివృద్ధిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 Colector Sayyadu Umar jalil Meeting on welfare programs

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : కేంద్ర సచివాలయ సర్వీసెస్ విభాగానికి చెందిన నలుగురు శిక్షణ అధికారులతో జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. గురువారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి వివరాలను శిక్షణ అధికారులకు వివరించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ ద్వారా చేపట్టిన రైతుబంధు పథకం, భూ ప్రక్షాళన కార్యక్రమాలపై వివరించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఎన్‌ఆర్‌ఐఇజిఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులపై, అటవీశాఖ ద్వారా చేపట్టిన తెలంగాణ హరితహారం, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అలాగే విద్యా శాఖ ద్వారా చేపడుతున్న సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకాలపై, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమాలను శిక్షణ అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రిసోర్స్ డెవెలప్‌మెంట్ ఇన్సిస్టిట్యూట్ నుంచి పంపబడిన నలుగురు శిక్షణ అధికారులు ఈ నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు ఎనిమిది వారాల పాటు వికారాబాద్ జిల్లాలోనే ఉండి చేపడుతున్న కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి అవగాహన కల్పించుకుంటా రని, జిల్లా అధికారులు వీరికకి సహకరించాలని సూచించారు. శిక్షణ అధికారులు కిషన్ చంద్, సునీల్‌కుమార్, మహాలింగం, మనూజ్ కుమార్ వర్మలతో పాటు జిల్లా అధికారులు ఇఇ పిఆర్ మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారులు రేణుకాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సబితా, అటవీశాఖ అధికారి వేణుమాధవ్ పాల్గొన్నారు.

Comments

comments