Home తాజా వార్తలు నాల్గో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..!

నాల్గో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..!

STOCK
ముంబయి: చమురు ధరలతో పాటు కర్నాటక రాజకీయ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడటంతో శుక్రవారం వరసగా నాల్గో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి.  సెన్సెక్స్ 301 పాయింట్లు నష్టపోయి 34,484 పాయింట్ల దగ్గర, నిప్టీ 86 పాయింట్లు నష్టపోయి 10, 596 పాయింట్లు వద్ద ముగిశాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్థాన్ యునిలివర్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పడ్డాయి. టాటా మోటార్స్, సిప్లా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, విఫ్రో తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి.